News September 27, 2024

ఎల్లారెడ్డిపేట: ఊడిన డీసీఎం టైర్లు

image

ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి మూలమలుపు వద్ద ఓ డీసీఎం వ్యాను టైర్లు ఊడిపోగా.. పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డికి చెందిన ఆయిల్ లోడుతో వ్యాన్ జగిత్యాలకు వెళుతోంది. రాగట్లపల్లి మూలమలుపు వద్దకు రాగానే డివైడర్‌కు తగిలిన డీసీఎం వ్యాన్ వెనుక టైర్లు ఊడిపోయి ఓ వైపు ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అప్రమత్తతో డీసీఎం వేగాన్ని అదుపు చేసి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Similar News

News November 12, 2025

హుజురాబాద్: రోడ్డు యాక్సిడెంట్ వ్యక్తి మృతి

image

హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట నుంచి హర్షిత్, త్రినేష్ ద్విచక్ర వాహనంపై హుజురాబాద్ వైపు వెళ్తుండగా సిరిసపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్షిత్, త్రినేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షిత్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 12, 2025

కరీంనగర్: ఆస్తి కోసం వేధిస్తున్న కొడుకు, కొడలుపై ఫిర్యాదు

image

ఆస్తి కోసం తెల్ల కాగితం మీద సంతకం చేయించుకొని ఆస్తి కాజేయాలని తన కొడుకు, కోడలు ప్రయత్నిస్తున్నారని HZB ఆర్డీఓకు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. జమ్మికుంటకు చెందిన గుల్లి లక్ష్మీ-మొగిలిలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు చెప్పారు. పెద్ద కొడుకు, కోడలు సంపత్-స్వరూప తెల్ల కాగితం మీద సంతకాలు చేయించుకుని ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.

News November 12, 2025

కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా అశ్విని తానాజీ వాంఖడే

image

కరీంనగర్ జిల్లా నూతన విద్యాధికారిగా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అశ్విని తానాజీ వాంఖడేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకే ఉన్న జిల్లా విద్యాధికారి చైతన్య జైనిని ఖమ్మం జిల్లాకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె విద్యాధికారిగా కొనసాగనున్నారు.