News April 1, 2025
ఎల్లారెడ్డిపేట: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్ చేసుకున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. లంబ శ్రీనివాస్‌రెడ్డి (29)కి తన భార్యకు చిన్నచిన్న గొడవలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మార్చి 18న శ్రీనివాస్ ఆత్మహత్యకు యత్నించాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే0శామని ఎస్సై తెలిపారు.
Similar News
News October 17, 2025
టైర్ పేలి దగ్ధమైన బస్సు.. 29 మంది క్షేమం

అనంతపురం (D) గార్లదిన్నె మం. తలగాచిపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి రాయచూర్‌లోని దేవదుర్గకు వెళ్తుండగా మార్గమధ్యలో బస్సు టైర్ పగిలింది. మంటలు ఎగిసి పడటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. ఎస్సై మహమ్మద్ గౌస్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
News October 17, 2025
సింగరేణి కార్మికులకు నేడు రూ.1.03 లక్ష బోనస్

కొత్తగూడెం: సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు శుక్రవారం దీపావళి సందర్భంగా పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు బోనస్ అందనుంది. యాజమాన్యం ఈసారి ఒక్కొక్క కార్మికుడికి రూ.1.03 లక్ష చెల్లించాలని నిర్ణయించింది. గత సంవత్సరం రూ.93,750 చెల్లించగా, ఈసారి రూ.9,250 పెంచి ఇస్తోంది. ఈ నగదు నేడు(శుక్రవారం) కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ప్రతి సంవత్సరం దీపావళికి ముందు సంస్థ ఈ బోనస్‌ను అందిస్తుంది.
News October 17, 2025
పిల్లలు చదవట్లేదా?

సాధారణంగా చాలామంది పిల్లలు చదువంటే ఆసక్తి చూపరు. ఆటలమీదే మనసు ఉంటుంది. కొన్నిసార్లు ఇది మానసిక సమస్యకు సంకేతం అంటున్నారు నిపుణులు. బార్డర్‌లైన్ ఇంటిలిజెన్స్, స్పెసిఫిక్ లర్నింగ్ డిజెబిలిటి, ADHD వంటి సమస్యలుంటే పాఠాలు అర్థంకాకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలుంటాయి. వీటిని గుర్తిస్తే చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లండి. చదువంటే భయం తగ్గి ఆసక్తి కలిగే పద్ధతులు నేర్పిస్తారు.


