News February 2, 2025
ఎల్లారెడ్డిపేట: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో బాధపడుతూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కోనేటి మల్లయ్య(43) అనే వ్యక్తి భార్య అంజవ్వతో గొడవపడ్డాడు. దీంతో భార్య, కూతురు శైలజ, కుమారుడు రాజులు తల్లిగారింటికి వెళ్లిపోయారు. తీవ్ర మనస్థాపానికి గురైన మల్లయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
Similar News
News February 19, 2025
ఆరంభంలోనే పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది. కాగా ప్రేక్షకులు లేక కరాచీ స్టేడియం వెలవెలబోతోంది. గ్రౌండ్‌లో ఎక్కడ చూసినా ఖాళీ స్టాండ్స్ దర్శనమిస్తున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో క్రికెట్ ప్రేమికులు పాకిస్థాన్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇంత పెద్ద టోర్నీని చూసేందుకు పాక్ ఫ్యాన్స్ ఆసక్తి చూపడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
News February 19, 2025
HYD: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
News February 19, 2025
స్టార్టప్‌ల వృద్ధిలో టీ-హబ్ కీలకపాత్ర: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలోని ప్రఖ్యాత ఇన్నోవేషన్ కేంద్రం టీ-హబ్ బ్రెజిల్‌కు చెందిన హబ్ ఆఫ్ గోయాస్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలోని స్టార్టప్‌లు బ్రెజిల్ మార్కెట్‌లో అవకాశాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. అలాగే 2 దేశాల స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం కానుందన్నారు. స్టార్టప్‌ల వృద్ధిని ప్రోత్సహించడంలో టీ-హబ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు.