News January 31, 2025
ఎల్లారెడ్డిపేట: గ్యాస్ స్టవ్ అంటుకొని మహిళ మృతి

ఎల్లారెడ్డిపేటలోని ఓ మహిళకు ప్రమాదవశాత్తు గ్యాస్ స్టవ్ అంటుకోగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మ కంటి పద్మ(86)ఈనెల 18వ తేదీన తన ఇంట్లో గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తోంది. ఈక్రమంలో అగ్ని ప్రమాదానికి గురైంది. 45% శరీరం కాలిపోయింది. 13 రోజులు చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది.
Similar News
News October 14, 2025
VKB: విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులకు సరైన విధంగా సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల సౌకర్యాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులకు వసతులు కల్పించాలన్నారు.
News October 14, 2025
అక్రమ ఇసుక రవాణకు కళ్లెం వేయాలి: VKB కలెక్టర్

వికారాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లతో, కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అక్రమ రవాణా జరుగకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.
News October 14, 2025
కోహ్లీ, రోహిత్ రిటైర్ అవ్వట్లేదు: BCCI VP

భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ కాబోతున్నారని, ఆస్ట్రేలియా సిరీసే చివరిదని జరుగుతున్న ప్రచారాన్ని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఖండించారు. ‘రోహిత్, కోహ్లీ ప్రజెన్స్ జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్. ఆస్ట్రేలియాను ఓడించడంలో వారు కీలకం. రిటైర్మెంట్ ప్లేయర్ల ఇష్టం. కానీ ఇది వారి చివరి సిరీస్ మాత్రం కాదు. అలాంటి ఆలోచన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.