News February 4, 2025

ఎల్లారెడ్డిపేట: చెట్టుకు ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య..

image

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట కిష్టా నాయక్ తండాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. సురేశ్(36) కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఎర్రగుట్ట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, యువకుడు ఆత్మహత్య చేసుకొని 4రోజులు గడిచి ఉండొచ్చని సమాచారం. దుర్వాసన వస్తుండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 24, 2025

మరో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి HMDA సిద్ధం

image

మరో గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు HMDA సిద్ధమవుతోంది ORR నుంచి ప్రాంతీయ రోడ్లకు అనుసంధానం చేసేలా వీటిని రూపొందిస్తున్నారు. బుద్వేల్ నుంచి 165 రహదారి వద్ద కోస్గి వరకు ఈ రహదారి నిర్మించనున్నారు. దీనికి సంబంధించి డీపీఆర్ రూపొందించే పనిలోపడ్డారు. డీపీఆర్ పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి ఈ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. 81 కి.మీ పొడవుతో, 4 లైన్లుగా రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.

News December 24, 2025

నేడు వామనావతారంలో భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీరామచంద్రుడు వామనావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బలి చక్రవర్తి అహంకారాన్ని అణచి, మూడు అడుగులతో విశ్వాన్ని కొలిచిన స్వామివారి వైభవాన్ని చూసి భక్తజనం పరవశించనుంది. కాగా ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆధ్యాత్మిక శోభతో భద్రాద్రి క్షేత్రం రామనామస్మరణతో మారుమోగుతోంది.

News December 24, 2025

ఏలూరు: యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులు మృతి.. అనాథలైన పిల్లలు

image

మండవల్లి మండలంలోని కానుకొల్లు గ్రామానికి చెందిన భార్యాభర్తలు పాలెపు వెంకన్న(41), గృహలక్ష్మి(37)లు కంకిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విజయవాడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు కుమార్తెలను చూడటానికి బైక్‌పై ఈ నెల 21న వెళ్తుండగా కారు ఢీకొంది. వెంకన్న అక్కడికక్కడే చనిపోగా.. చికిత్స పొందతూ గృహలక్ష్మి నిన్న కన్నుమూసింది. దీంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.