News February 4, 2025
ఎల్లారెడ్డిపేట: చెట్టుకు ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య..

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట కిష్టా నాయక్ తండాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. సురేశ్(36) కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఎర్రగుట్ట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, యువకుడు ఆత్మహత్య చేసుకొని 4రోజులు గడిచి ఉండొచ్చని సమాచారం. దుర్వాసన వస్తుండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 8, 2025
ఫోక్సో కేసుల దర్యాప్తు వేగవంతం: బాపట్ల SP

ఫోక్సో కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. శుక్రవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో డీపీఓలో విధులు నిర్వహించే సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది పనితీరు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలకు సంబంధించిన కేసులను 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని అన్నారు. అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
News February 8, 2025
క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అమలుకు రూ.2.16 కోట్లు: జేసీ

జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్య నియంత్రణ అమలుపై శుక్రవారం సమీక్షించారు. ఏలూరు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలంలో పెద్ద ఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. వాయు కాలుష్య నియంత్రణకు రూ 2.16 కోట్లు కేటాయించారన్నారు.
News February 8, 2025
శ్రీ సత్యసాయి జిల్లా మహిళలకు గుడ్‌న్యూస్

శ్రీ సత్యసాయి జిల్లాలోని మహిళలకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. ఈ నెల 28వ తేదీ నుంచి మహిళలకు కుట్టు మెషీన్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా మహిళలకు శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ వద్ద ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.