News February 18, 2025
ఎల్లారెడ్డిపేట: బస్సు టైర్ పంచర్.. తప్పిన ప్రమాదం

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ శివారులోని బస్సు టైర్ పంచర్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. వీర్నపల్లి మండలం వన్పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 110మంది ప్రయాణికులతో వెళుతుండగా బస్సు ఒక్క సైడు ఒరిగి ఆగిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల నుంచి వన్ పల్లికి మరికొన్ని బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News February 24, 2026
సంగారెడ్డి: మార్చి 2 నుంచి ప్రత్యేక పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక పరీక్షలు-3 నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. మార్చి 2న తెలుగు, 4న హిందీ, 5న ఇంగ్లిష్, 6న గణితం, 7న ఫిజికల్ సైన్స్, 9న జీవశాస్త్రం, 10న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని సూచించారు.
News February 24, 2026
IOCL దిగ్బోయ్ రిఫైనరీలో పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News February 24, 2026
రామప్ప టెంపుల్ WONDERFUL: ఫ్రాన్స్ దేశస్థులు

వెంకటాపూర్ మండలం పాలంపేటలోగల కాకతీయుల కాలంనాటి రామప్ప దేవాలయం అద్భుతంగా ఉందని ఫ్రాన్స్ దేశస్థులు అన్నారు. మంగళవారం ఆలయంలో రామలింగేశ్వర స్వామికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉమాశంకర్, హరీశ్ శర్మ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ గైడ్ తాడే బోయిన వెంకటేశ్ ద్వారా ఆలయ చరిత్ర, శిల్ప సంపద గురించి తెలుసుకున్నారు. వారివెంట టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, అరుణ్ కుమార్, భద్రు ఉన్నారు.


