News March 27, 2025
ఎల్లారెడ్డిపేట: మోర్చా కార్యదర్శిగా బుర్కా సంగీత

రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా బుర్కా సంగీత నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు. బుర్కా సంగీత గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భూత్ అధ్యక్షరాలిగా, మండల నాయకురాలిగా భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు పొంది ఇప్పుడు మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమించడం సంతోషకరమని మండల నాయకులు అందరూ అభినందనలు తెలిపారు.
Similar News
News November 28, 2025
పీసీఓఎస్ ఉందా? ఇలా చేయండి

పీసీఓఎస్ ఉన్నవారిలో ప్రధాన సమస్య బరువు. ఎంత కడుపు మాడ్చుకున్నా, వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటివారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. పులియబెట్టిన ఆహారాలు, ఫైబర్, ప్రొటీన్ ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాలి. అవకాడో, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, నట్స్.. వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. వీటితో పాటు వ్యాయామాలు, తగినంత నిద్ర ఉండాలి.
News November 28, 2025
ప్రేరణ తరగతులను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నామని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురంలో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు విద్యా ప్రార్ధన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కోనసీమ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి ఒత్తిడిని అధిగమించి విద్యపై ఏకాగ్రత చూపాలన్నారు.
News November 28, 2025
2,757 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 2,757 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకామ్, బీఎస్సీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 18 వరకు NAPS/NATS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iocl.com


