News February 12, 2025

ఎల్లారెడ్డి: అపార్ వివరాలను తక్షణమే పూర్తి చేయాలి: డీఈఓ

image

ఆపార్ వివరాలను ఆన్‌లైన్లో తక్షణమే పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఆదేశించారు. ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో బుధవారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి హాజరై మాట్లాడారు. యుడైస్‌లోని ఖాళీలు పూర్తి చేయాలన్నారు. సెలబస్ పూర్తిచేసి రివిజన్ చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. ఎంఈఓ వెంకటేశం పాల్గొన్నారు.

Similar News

News February 13, 2025

అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు

image

అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఉన్న అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో మరో మూడు క్యాంటీన్లు అదనంగా ఏర్పాటు చేస్తారు. అలాగే కొత్తగా పాయకరావుపేట, మాడుగుల, చోడవరంలో క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి.

News February 13, 2025

విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్: ఆలూరు సాంబ

image

విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ సీనియర్ నేత ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని ప్రజలు నమ్మి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

News February 13, 2025

వృద్ధ దంపతులు సూసైడ్.. కారణమిదే..!

image

ఖమ్మం బ్యాంక్ కాలనీలో <<15433998>>వృద్ధ దంపతులు సూ<<>>సైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కష్టపడి దాచుకున్న సొమ్ము అప్పుగా ఇస్తే.. తిరిగి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసినట్లు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. వైద్యానికి డబ్బులేక మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.

error: Content is protected !!