News December 10, 2024
ఎల్లారెడ్డి: చిరుత దాడిలో దూడ మృతి?

ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత దాడిలో దూడమృతి చెందినట్లు బాధితుడు సత్యనారాయణ తెలిపారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ గెదేలతో పాటు దూడను వ్యవసాయ బావి వద్ద ఉంచి ఇంటికి వెళ్లాడు. తిరిగి బావి వద్దకు వద్దకు వచ్చి చూడగా దూడ మృతి చెందినట్లు గుర్తించారు. చిరుత దాడిలో గేదె మృతి చెందిందని సత్యనారాయణ ఆయన ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వారు పంచనామ నిర్వహించారు.
Similar News
News January 9, 2026
టీయూ: అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు

టీయూ ఇంటర్ కాలేజ్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ పోటీల ఫైనల్ మ్యాచ్ను శుక్రవారం వర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ డా.బాలకిషన్ తెలిపారు. తుదిపోరు నిశిత డిగ్రీ కళాశాల, గిరిరాజ్ కళాశాల మధ్య జరగగా నిశిత కళాశాల విజేతగా నిలిచింది. ఈ మేరకు ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డా.రాంబాబు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ నేత, ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు.
News January 9, 2026
బాస్కెట్ బాల్ స్టేట్ కమిటీలో నిజామాబాద్ జిల్లా వాసి

తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జిల్లాకి చెందిన బొబ్బిలి నరేశ్ నియామకం అయ్యారు. నిజామాబాద్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొబ్బిలి నరేశ్ కుమార్కు ఈ అవకాశం రావడంతో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
News January 9, 2026
టీయూ పరిధిలో పీజీ పరీక్షలు వాయిదా

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 16 నుంచి జరగాల్సిన పీజీ ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్ డబ్ల్యూ/ఎంబీఏ/ఎంసీఏ/ఐఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.


