News February 9, 2025
ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఎల్లారెడ్డి పట్టణ శివారులోని మీసాన్ పల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి నుంచి బిక్కనూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఏగొండ(18) అనే యువకుడు తన వాహనాన్ని అతివేగంగా నడిపి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 9, 2025
‘తండేల్’ సినిమాలో మూలపేట మహిళ
ఇటీవల విడుదలైన ‘తండేల్’ సినిమాలో నటించే అరుదైన అవకాశం మూలపేటకు చెందిన రాజ్యలక్ష్మి (రాజి)కి దక్కింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం సముద్ర తీర ప్రాంతమైన మూలపేట గ్రామానికి చెందిన ఆమె, ఇంతకుముందు పలు సీరియల్, సినిమాల్లో నటించారు. కూలీ నిమిత్తం వెళ్లి పాకిస్థాన్ జైల్లో ఉంటున్న వ్యక్తి భార్యగా, ఆమె మత్స్యకార మహిళ పాత్రలో ‘తండేల్’ సినిమాలో నటించడం విశేషం.
News February 9, 2025
చిత్తూరు: మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు
చిత్తూరు జిల్లాలో కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన పది మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. తొలుత దరఖాస్తులకు ఐదో తేదీ వరకే గడువు విధించడంతో 13 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో గడువును 8వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. దరఖాస్తుదారులకు సోమవారం లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
News February 9, 2025
డోన్: విద్యుత్ షాక్ తగిలి కూలి మృతి
కూలి పనుల కోసం రేకుల షెడ్డు నిర్మాణానికి వెళ్లిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన విషాదకర సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది. సుందర్ సింగ్ కాలనీకి చెందిన ఖాజాబాషా(32) కొత్తపల్లి గ్రామ సమీపంలో రేకుల షెడ్డు నిర్మాణానికి కూలి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా పైభాగంలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని డోన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.