News September 6, 2024
ఎల్లారెడ్డి హాస్టల్‌లో రాళ్లతో దాడి చేసుకున్న విద్యార్థులు
ఎల్లారెడ్డి గురుకుల హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొంతకాలంగా విద్యార్థుల మధ్య జరుగుతున్న గొడవ గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 13, 2024
KMR: ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవము ఈనెల 17న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం జిల్లా కార్యాలయాల భవన సముదాయం సమావేశ మందిరంలో ఎస్పీ సిందూ శర్మతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ నెల 17 న తెలంగాణా ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహిస్తామని తెలిపారు.
News September 12, 2024
బాన్సువాడలో కత్తులతో దాడి చేసుకున్న వ్యక్తులు
మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడి కత్తులతో దాడి చేసుకున్న ఘటన బుధవారం రాత్రి బాన్సువాడలో జరిగింది. తాడ్కోల్ చౌరస్తాలోని ఓ బార్ వద్ద నడి రోడ్డుపై మద్యం మత్తులో సోనుసింగ్, సంజీవ్ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సోనుసింగ్ తల్వార్‌తో సంజీవ్ పై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు చికిత్స కోసం నిజామాబాద్ తరలించి కేసు నమోదు చేశారు.
News September 12, 2024
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు పిట్లం విద్యార్ధిని ఎంపిక
రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు పిట్లం ZPHS విద్యార్ధిని మహాలక్ష్మి ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ సంజీవులు తెలిపారు. పాల్వంచలో ఈ నెల 9 న జరిగిన జిల్లాస్థాయి ఖో ఖో టోర్నమెంట్లో మహాలక్ష్మి ప్రతిభ కనబరిచింది. ఖమ్మంలో జిల్లా కల్లూరు మిని స్టేడియంలో ఈనెల 13 నుంచి 15 వరకు జరిగే ఖో ఖో సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఆమె ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు అభినందించారు.