News June 29, 2024

ఎల్.ఎన్.పేట: అనారోగ్యంతో సీఐఎస్ఎఫ్ జవాన్ మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం ముంగెన్నపాడు గ్రామానికి చెందిన సీఐఎస్ఎఫ్ జవాను యారబాటి ప్రసాదు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ప్రసాద్ చెన్నైలో సీఐఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. ఈయనకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేడు ప్రసాద్ మృతదేహం చెన్నై నుంచి గ్రామానికి చేరుకుంటుందని మాజీ సర్పంచ్ యరబాటి రాంబాబు తెలిపారు.

Similar News

News September 21, 2024

శ్రీకాకుళం: అందుబాటులో యాంటీ రాబిస్ వ్యాక్సిన్

image

శ్రీకాకుళం జిల్లా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్క కాటుకు సంబంధించిన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామని DM&HO డా. బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. CHC సెంటర్ల వద్ద కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అన్నారు. ఇండెంట్ పెట్టిన వెంటనే ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కుక్కకాటు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని మంచి వైద్యం అందుతుందన్నారు.

News September 20, 2024

హైదరాబాద్‌లో సిక్కోలు వాసి మృతి

image

కొత్తూరు మండలం జోగిపాడుకు చెందిన లుకలాపు పాపయ్య కుమారుడు జనార్దన్ (42) శుక్రవారం హైదరాబాద్‌లో మరణించాడు. సహోద్యోగులు, కుటుంబీకుల వివరాల ప్రకారం.. మృతుడు 2001 నుంచి అక్కడే ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజులాగే డ్యూటీకి వెళ్లి ఇంటికి రాకుండా సెకండ్ షిఫ్ట్‌లో ఉరేసుకొని చనిపోయాడు. కేసు నమోదు చేసుకొని పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.

News September 20, 2024

టెక్కలిలో రూ.4 కోట్ల విద్యుత్ బకాయి.. పరిశ్రమకు కరెంట్ కట్

image

టెక్కలి మండలంలోని మెట్కోర్ అల్లాయిస్ పరిశ్రమకు అధికారుల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రావివలసలోని ఈ పరిశ్రమ సుమారు రూ.4 కోట్ల మేరకు విద్యుత్ బకాయి పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం టెక్కలి విద్యుత్ శాఖ అధికారులు పరిశ్రమకు సరఫరాను నిలిపివేశారు. హెచ్.టీ సర్వీస్ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ బకాయిలు కోట్ల రూపాయలలో ఉండటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు నోటీసులు జారీ చేశారు.