News July 12, 2024
ఎల్.ఎన్.పేట: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వెలుగు ఏపీఎం ఎస్ రవిరాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం ఆవరణంలో బంగారు సంతోషి సంస్థలు ఉచితంగా అందించిన మొక్కలను సిబ్బందితో కలిసి ఆయన నాటారు. మొక్కలు నాటడం వలన పర్యావరణానికి మేలు చేకూరుతుందని తెలియజేశారు. వాతావరణంలో కాలుష్యం తగ్గాలంటే మొక్కలు ప్రాధాన్యత ఎంతో ఉందని ఏపీఎం చెప్పారు. ఈయనతో పాటు విజయలక్ష్మి, శంకర్, పాండురంగనాథరాజు పాల్గొన్నారు.
Similar News
News October 21, 2025
కవిటి: ఆ గ్రామం ఆదర్శం..!

కవిటి (M) పొందూరు పుట్టుగ గ్రామం దీపావళి పండగకు దూరంగా ఉంది. కారణం ఏమిటంటే..? ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు దూగాన రామ్మూర్తి (44), ప్రణయ్ (17) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి నాడు బాధిత కుటుంబంలో అమావాస్య చీకట్లు అల్లుకున్నాయని గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
News October 21, 2025
ఎంపీ కలిశెట్టి దీపావళి వేడుకలు భళా

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలం ప్రభుత్వ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు స్వీట్స్ పంచి వారితో బాణాసంచా కాల్చారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బాలికలతో ఇలా దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
News October 21, 2025
శ్రీకాకుళం: ‘RTCలో 302 మందికి ప్రమోషన్లు’

శ్రీకాకుళం APRTC డివిజన్ పరిధిలో 23 కేటగిరిల్లో విధులు నిర్వహిస్తున్న 302 మందికి ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదివారం, సోమవారం ప్రమోషన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. రెండు, మూడు రోజుల్లో జాబితా ప్రకటిస్తామని ఆయన వివరించారు.