News November 18, 2024
ఎల్.కోట: అసిస్టెంట్ రైటర్ సస్పెండ్

ఎల్.కోట మండలం భీమాలిలో ఇటీవల కోడి పందేలను నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన ఘటనలో విచారణ కొనసాగుతుందని DIG గోపీనాథ్ జెట్టీ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బాధ్యులైన పోలీసులపై చర్యలు తప్పవన్నారు. కోడిపందేల స్థావరంపై రైడ్ చేసిన పోలీసులు కేసులు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించారని SP విచారణలో వెల్లడి కావడంతో ఎల్.కోట అసిస్టెంట్ రైటర్ జీ.సత్యనారాయణను సస్పెండ్ చేశామన్నారు.
Similar News
News November 1, 2025
VZM: కళ్లద్దాల పంపిణీకు టెండర్లు స్వీకరణ

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు సరఫరా చేసేందుకు టెండర్ల స్వీకరణ ప్రారంభమైందని DMHO జీవన రాణి, అంధత్వ నివారణ సంస్థాధికారి త్రినాథరావు తెలిపారు. 3,500 కళ్ల జోళ్లు పంపిణీకి గానూ ఒక కంటి అద్దం ధర ఫ్రేమ్, గ్లాస్, GST సహా రూ.280 మించకూడదన్నారు. ఆసక్తి గల వారు రూ.25,000 ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) తో నవంబర్ 5 సాయంత్రం 5 గంటల లోపు టెండర్ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
News October 31, 2025
విజయనగరంలో పోలీసుల క్యాండిల్ ర్యాలీ

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా విజయనగరంలో ఘనంగా కాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ..దేశ భద్రత, శాంతి కాపాడడంలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమర వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు. పోలీసు విధుల్లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు జోహార్లు తెలిపారు.
News October 31, 2025
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: VZM DMHO

PC & PNDT చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిషేధమని, ప్రతి స్కానింగ్ సెంటర్ తప్పనిసరిగా వివరాలు నమోదు చేసి సమర్పించాల్సిందేనని DMHO డా. జీవన రాణి తెలిపారు. DMHO కార్యాలయంలో జరిగిన సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వానికి చెందిన 22 స్కానింగ్ సెంటర్లతో పాటు ప్రైవేట్ రంగంలో మరో 102 సెంటర్లు జిల్లాలో పనిచేస్తున్నాయని చెప్పారు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


