News June 14, 2024
ఎల్.కోట: పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడు

ఎల్.కోట పోలీస్ స్టేషన్ పరిదిలోని కొనమసివానిపాలెం గ్రామనికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు శారీరకంగా వాడుకున్నాడని, పెళ్లి మాట వచ్చేసరికి ముఖం చాటేసినట్లు యువతి చెప్పింది. యువకుని తల్లిదండ్రులను సంప్రదిస్తే కులాంతర వివాహం అంటూ నిరాకరించడంతో గురువారం పోలీసులను ఆశ్రయించింది.
Similar News
News December 10, 2025
VZM: పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ ద్వారా పరిష్కరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అధికారులకు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. పోలీసు స్టేషన్ స్థాయిలోనే రాజీ అయ్యే అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, ట్రాఫిక్ కేసులు, చిన్న క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, పెండింగ్ చలాన్లను ముందుగా గుర్తించాలని సూచించారు.
News December 10, 2025
విజయనగరం: మా జీతాలు ఇవ్వండి సార్..!

విజయనగరం జిల్లాలో ఆర్ అండ్ బీ, జలవనరులు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ సహా ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగస్థులకు 10వ తేదీ వచ్చినా కూడా ప్రభుత్వం జీతాలు వేయలేదని బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎల్వీ యుగంధర్ని ఏపీసిపిఎస్ఈఏ సభ్యులు కలిసి సమస్యను విన్నవించుకున్నారు. ఈ విషయంపై ఎస్టీఓ అమరావతి అధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
News December 10, 2025
VZM: దుకాణాల్లో పండగ ఆఫర్లు

క్రిస్మస్, సంక్రాంతి పంగల సందర్భంగా APCO ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిందని విజయనగరం మండల వాణిజ్య అధికారి RV మురళీ కృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై సాధారణ 40% తగ్గింపుతో పాటు అదనపు రాయితీలు కూడా ఉంటాయన్నారు. గంటస్తంభం, MG రోడ్డు, పూల్భాగ్, చీపురుపల్లిలో ఉన్న విక్రయ శాలల్లో లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు.


