News August 17, 2024

ఎల్ బ్రోస్ పర్వతాన్ని అధిరోహించిన సీలేరు కుర్రాడు

image

ఉమ్మడి విశాఖ జిల్లా సీలేరుకు చెందిన యువకుడు అరుదైన ఘనత సాధించాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న మలసాల శ్రీను కుమారుడు సాయితేజ యూరప్‌లో ఉన్నారు. ఈక్రమంలో రష్యాలో 18,500 అడుగుల ఎత్తులో ఉన్న ఎల్ బ్రోస్ పర్వతాన్ని అధిరోహించి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఇందుకు తనకు ఆరు రోజులు పట్టిందని.. ఈ ఘనత సాధించడం చాలా ఆనందంగా ఉందని సాయితేజ పేర్కొన్నాడు.

Similar News

News November 28, 2025

మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళులర్పించిన విశాఖ కలెక్టర్

image

మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలే వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని శుక్ర‌వారం నౌరోజీ రోడ్డులోని ఆయన విగ్ర‌హానికి కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ పూల‌మాల వేసి నివాళులర్పించారు. ఫూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు, సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఫూలే అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారన్నారు.

News November 28, 2025

రేపు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించే నేవీ డే ముందస్తు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. శనివారం సాయంత్రం సముద్రికలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. డిసెంబర్ 4న నేవీ డేకి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు విశాఖలో చేపట్టారు. పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి షీలా నగర్.. మారుతీ జంక్షన్ మీదుగా ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చేరుకుంటారు.

News November 28, 2025

శ్రీహరిపురంలో యువకుడు ఆత్మహత్య

image

శ్రీహరిపురంలోని తన ఇంట్లో ఓ యువకుడు వంశీ ఫ్యానుకు ఊరివేసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.