News November 2, 2024
ఎవరినైనా ఇబ్బంది పెట్టామా: సీఎం చంద్రబాబు
విజయనగరం జిల్లాలో ఎన్నికల కోడ్ రావడంతో ప్రోగ్రాం పరవాడకు మార్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాత్రి రాత్రికి ప్రోగ్రాం మార్చినా ఎక్కడైనా పరదాలు కట్టామా, చెట్లు కొట్టామా, ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి అరెస్ట్ చేయించామా అన్నారు. రోడ్లు బాగోలేక RTC బస్సులను నిలిపివేశారని పేర్కొన్నారు. గుంతలతో ప్రయాణీకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మంచి రోజులు వచ్చాయని ఈ గ్రామం నుంచే మంచి రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామన్నారు.
Similar News
News December 11, 2024
సింహాచలం: 12 నుంచి రెండవ విడత నృసింహ దీక్షలు
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో రెండవ విడత నృసింహ దీక్షలు 12వ తేదీన ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి దీక్షలు తీసుకుంటున్న భక్తులకు ఆలయ వైదికలు మాలాధారణ చేయనున్నట్లు తెలిపారు. దీక్షలు స్వీకరించే భక్తులకు తులసిమాలలు, స్వామివారి ప్రతిమలను ఉచితంగా అందజేస్తామన్నారు. 32 రోజుల తర్వాత వచ్చే నెల 12న మాల విసర్జన జరుగుతుందన్నారు.
News December 11, 2024
విశాఖ: రద్దీ కారణంగా పలు స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డిసిఎం కె సందీప్ పేర్కొన్నారు. త్రివేండ్రం నార్త్-షాలిమార్ కొచ్చువేలి స్పెషల్ ట్రైన్ వచ్చే నెల 24వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే తిరునల్వేలి-షాలిమార్-తిరునల్వేలి ప్రత్యేక రైలు, పొదనూర్-బరౌని పొదనూర్ స్పెషల్ ట్రైన్, తాంబరం-సంత్రగచ్చి-తాంబరం స్పెషల్ పొడిగించామన్నారు.
News December 11, 2024
అనకాపల్లి: గోడకూలి ఇద్దరు మృతి
మాకవరపాలెం మండలం కోడూరులో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. గ్రామానికి చెందిన వేగి పైడమ్మ ఇంటి వద్ద రోజూ స్థానికులు కూర్చుని మాట్లాడుకుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఈ గోడవద్ద మాట్లాడుకుంటున్న కోయిలాడ కాంతం(73), వేడి భీముడు(70) లపై గోడ కూలిపోయింది. దీంతో కాంతం అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డ భీముడును 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.