News March 22, 2024
ఎవరు ఎలాంటి వారో అర్థమైంది : ఎమ్మెల్యే శ్రీదేవి

‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాపట్ల ఎంపీ సీటుపై ఆమె ఆశ పెట్టుకోగా, ఆ ఎంపీ సీటును TDP అధిష్టానం కృష్ణ ప్రసాద్‌కు కేటాయిస్తూ ప్రకటన చేయడంతో ఆమె నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. వైసీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
Similar News
News February 7, 2026
ANU: పీజీ ఆర్ట్స్, సైన్స్, లా పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన పలు పీజీ కోర్సుల మూడో సెమిస్టర్, లా కోర్సుల పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు ఈనెల 16వ తేదీలోగా అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.
News February 7, 2026
ANU: బీఆర్క్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు ఈ నెల 16వ తేదీలోగా అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.
News February 7, 2026
గుంటూరు: అంబటి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

CMని దూషించిన కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్, అలాగే ఆయనకు బెయిల్ ఇవ్వాలని డిఫెన్స్ తరపు న్యాయవాదులు కోరిన పిటిషన్లపై గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. ప్రాసిక్యూషన్ తరపున డీడీ విజయలక్ష్మి, అంబటి తరపున పొన్నవోలు తమ వాదనలు వినిపించారు.


