News July 13, 2024

ఎవరైనా గంజాయి అమ్మితే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి: ఎస్పీ

image

అమాయక విద్యార్థులు, యువకులకు గంజాయి విక్రయించే వారికి జైలు శిక్ష తప్పదని ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ హెచ్చరించారు. ఒంగోలులో SP మాట్లాడుతూ.. జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా 25 మందిని అరెస్టు చేసి వారి నుంచి 8.91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 14500కు తెలియజేయాలని కోరారు. SHAREit

Similar News

News October 13, 2025

రేపు ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించిన నేపథ్యంలో ప్రకాశంకు రేపు వర్ష సూచన ఉన్నట్లు ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రకాశం జిల్లాలో మంగళవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద ఉండరాదని సూచించారు.

News October 13, 2025

ప్రకాశం SP మీకోసంకు 71 ఫిర్యాదులు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఏఎస్పీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు ఎస్పీ మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో వారు మాట్లాడి సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.

News October 13, 2025

ఒంగోలులో CPRపై అవగాహన

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఆర్‌పై అవగాహన నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రాణాపాయ స్థితి నుంచి సీపీఆర్ ద్వారా మనిషిని రక్షించే చర్యను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు సమక్షంలో ప్రజలకు సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు. అలాగే సీపీఆర్ సమయంలో చేయకూడని పనుల గురించి సైతం వివరించారు.