News April 24, 2024

ఎవరైనా దాడి చేస్తే నాకు చెప్పండి: సీఎం జగన్

image

వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారిపై ఎవరైనా దాడి చేస్తే తనకు చెప్పాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ‘అవతలి వారు మన మీద దాడి చేస్తే మనం విజయానికి చేరువలో ఉన్నామని.. అలాగే వారు విజయానికి దూరంలో ఉన్నట్లు భావించాలి’అని అన్నారు. ఈ సమావేశంలో భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.

Similar News

News January 19, 2026

విశాఖ జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి బాధ్యతల స్వీకరణ

image

విశాఖపట్నం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిళ్ల విద్యాధరి సోమవారం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని ఆమె పరిచయం చేసుకున్నారు. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన మయూర్ అశోక్ బదిలీపై గుంటూరు వెళ్లారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు.

News January 19, 2026

వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే మెమోలు: కలెక్టర్

image

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. అంతకుముందు అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలన్నారు. జీవీఎంసీలో సాధారణ, టౌన్ ప్లానింగ్ వినతులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్‌కి ఆదేశించారు. అలసత్వం వహిస్తే 2 సార్లు మెమోలు ఇవ్వాలని, మూడోసారి ఛార్జి మెమో ఇవ్వాలన్నారు.

News January 19, 2026

విశాఖ: ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ రాలేదు!

image

ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ 10 గంటలకు ప్రారంభమైనా ఫిర్యాదుదారులు కనిపించలేదు. మరోవైపు అధికారులు కూడా సగానికి పైగా లేకపోవడం విశేషం. అన్ని సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో వచ్చిన వారు విస్తుపోతున్నారు. పండగ ఎఫెక్ట్ కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని పలువురు భావిస్తున్నారు.