News January 29, 2025

ఎవ్వరూ అధైర్య పడొద్దు: పెద్దిరెడ్డి

image

మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంగళవారం తిరుపతిలో బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేశ్ కలిశారు. రానున్న రోజుల్లో పుంగనూరులో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలపై పెద్దిరెడ్డి దిశా నిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. తమ కుటుంబం ఎల్లప్పుడు అండగా ఉంటుందని పెద్దిరెడ్డి చెప్పినట్లు రాజేశ్ తెలిపారు.

Similar News

News November 13, 2025

కాణిపాకంలో జైళ్ల శాఖ డీజీపీ

image

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం జైళ్ల శాఖ డీజీపీ ఆంజనీ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటం బహుకరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.

News November 13, 2025

జైళ్ల శాఖ డీజీపీని కలిసిన చిత్తూరు SP

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ అంజనీ కుమార్‌ను గురువారం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు వచ్చిన ఆయన్ను పోలీసు గెస్ట్ హౌస్‌లో కలిసి బొకే అందజేసి స్వాగతం పలికారు. అలాగే అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆయన్ను కలిశారు.

News November 12, 2025

కాణిపాక ఆలయానికి రూ.1.06 కోట్ల ఆదాయం

image

కాణిపాకంలో ఆన్‌లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలాలు బుధవారం నిర్వహించారు. ఈక్రమంలో దేవస్థానానికి మొత్తం రూ.1,06,99,997 ఆదాయం లభించింది. షాపింగ్ కాంప్లెక్స్, హోటల్ లైసెన్స్ హక్కు రూ.54.63 లక్షలు, పాదరక్షల భద్రపరుచుకునే హక్కు రూ.24.56 లక్షలు, వినాయక సదన్ హోటల్ లైసెన్స్ హక్కు రూ.27.10 లక్షలు, కళ్యాణమండపం షాపు హక్కు రూ.70 వేలు పలికిందని ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు.