News March 2, 2025

ఎస్ఎల్‌బీసీ ఘటనా స్థలానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన దుర్ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్నట్లు సమాచారం. సీఎం ఈరోజు మధ్యాహ్నం వనపర్తి పట్టణంలో జరిగే బహిరంగ సభ అనంతరం హెలీప్యాడ్ ద్వారా దోమలపెంటకు చేరుకుంటారని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దుర్ఘటన జరిగిన స్థలానికి వెళ్లనున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. దుర్ఘటన జరిగి తొమ్మిది రోజులు కావస్తోంది.

Similar News

News December 25, 2025

TPUS జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్ రావు

image

జగిత్యాల TPUS జిల్లా అధ్యక్షుడిగా బోయినపల్లి ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరికి రాష్ట్ర బాధ్యులు ఒడ్నాల రాజశేఖర్, గుడిసె పూర్ణచందర్, బోయినపల్లి చంద్రశేఖర్, గంప కిరణ్ కుమార్, బీర్పూర్ మండల శాఖ అధ్యక్షుడు చుక్క కిరణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి వడ్కాపురం సత్యవంశీ శుభాకాంక్షలు తెలిపారు.

News December 25, 2025

BREAKING: NZB: చందూర్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

image

నిజామాబాద్ జిల్లా చందూరు మండల శివారులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బాన్సువాడ నుంచి నిజామాబాద్ వెళుతున్న కారు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ చనిపోయింది. సదరు మహిళ బిహార్ నుంచి నాట్లు వేసేందుకు తెలంగాణకు వచ్చినట్లు సమాచారం.

News December 25, 2025

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

image

TG: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29న 10.30amకు మొదలవుతాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నిరోజులు సమావేశాలు జరగాలనేది BAC భేటీలో నిర్ణయించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరిగే ఆస్కారముంది. అలాగే MPTC, ZPTC ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే దానిపై డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది.