News January 17, 2025
ఎస్ఐపై చర్యలు తీసుకుంటాం: GNT ఎస్పీ
పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాశ్ రావు, ఎస్ఐ రాజ్ కుమార్ మధ్య జరిగిన వాగ్వాదంపై విచారణ జరుగుతోందని, న్యాయవాదులు గుర్తించి తమ శాఖకు సహకరించాలని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. ఘటన జరిగిన రోజు నుంచే రాజ్ కుమార్‌ని వీఆర్‌కు పంపించి డీఎస్పీతో విచారణ చేయిస్తున్నామన్నారు. ఎంక్వైరీ ఆధారంగా ఎస్ఐపై చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News January 18, 2025
గుంటూరులో ఇద్దరు డీఎస్పీలు బదిలీ
గుంటూరు వెస్ట్, సౌత్ డీఎస్పీలు జయరామ్ ప్రసాద్, మల్లికార్జునరావును ప్రభుత్వం బదిలీ చేసింది. గతేడాది బోరుగడ్డ అనిల్ కుమార్ అరండల్‌పేట స్టేషన్లో ఉన్నప్పుడు దిండు, దుప్పట్లు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను కలిసి రాచమర్యాదలు చేశారనే దానిపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇదిలా ఉంటే బదిలీతో ఖాళీ అయిన స్థానాలను భానోదయ, అరవింద్‌తో ప్రభుత్వం భర్తీ చేసింది.
News January 18, 2025
గుంటూరులో ముగ్గురికి జీవిత ఖైదు
గుంటూరు బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాది హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు విధించారు. లక్ష చొప్పున జరిమానా, బాధితురాలి పరిహారం కింద రూ.1,50,000 విధిస్తూ గుంటూరు 5వ అదనపు జడ్జి తీర్పు వెలువరించారు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన న్యాయవాది రాచబత్తుని సీతా మహాలక్ష్మిని 2014లో సుబ్బారావు, శ్రీవాణి, మేరీజ్యోతి అనే ముగ్గురు కలిసి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు.
News January 18, 2025
BREAKING: బస్సులు ఢీ.. గుంటూరు వాసులు మృతి
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు గుంటూరు నుంచి HYD వెళ్తుండగా SV కళాశాల సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో క్లినర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా.. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్లోనే చనిపోయాడు. గుండెపోటుతో ప్రయాణికుడు మృతిచెందాడు. మృతిచెందిన వారు గుంటూరు వాసులు సాయి, రసూల్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.