News November 7, 2024

ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్ డే పై అధికారులతో ఎమ్మెల్యే సోమిరెడ్డి సమీక్ష

image

ఎస్టీల అభ్యున్నతికి ప్రతి ఒక్క అధికారి తమ వంతు బాధ్యత వహించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బుధవారం రాత్రి ఆయన ఈనెల 8వ తేదీ వెంకటాచలం మండలం చెముడుగుంటలో నిర్వహించనున్న ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీవో అనూష తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 7, 2024

YCP అధినేత జగన్‌తో కాకాణి భేటీ

image

YCP అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇందులో భాగంగా వారు జిల్లాలోని పార్టీ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించినట్లు కాకాణి తెలిపారు.

News November 7, 2024

నెల్లూరు: పదో తరగతి ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

పదో తరగతి ఫీజు చెల్లింపునకు గడువును ఈనెల 18 వరకు పొడిగిస్తున్నట్లు నెల్లూరు DEO R.బాలాజీ రావు తెలిపారు. రూ.50 ఫైన్‌తో ఈనెల 25 వరకు, రూ.200 ఫైన్‌తో వచ్చే నెల 03 వరకు, రూ.500 ఫైన్‌తో 10 వరకు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, సప్లమెంటరీ విద్యార్థులు మూడు సబ్జెక్టులకు రూ.110, ఆపై సబ్జెక్టు రూ.125 చెల్లించాలన్నారు. 

News November 6, 2024

శరవేగంగా కార్తీక మాస లక్ష దీపోత్సవ ఏర్పాట్లు

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతుల సహకారంతో జరగనున్న కార్తీక మాస లక్ష దీపోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవంబర్ 8, 9, 10 తేదీల్లో నెల్లూరు నగరంలోని VRC మైదానంలో లక్ష దీపోత్సవాలు నిర్వహించనున్నారు. లక్ష దీపోత్సవం కోసం ఏర్పాట్లు శరవేగంగా నిర్వహిస్తున్నారు.