News October 24, 2024
ఎస్టీ మాకివలస: గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎడిషనల్ ఎస్పీ

జలుమూరు మండలం మర్రివలస పంచాయతీ ఎస్టీ మాకివలస గ్రామాన్ని గురువారం మధ్యాహ్నం జిల్లా ఎడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించారు. ఇటీవల జరిగిన గ్రామంలో జరిగిన గొడవలు, కొట్లాట విషయంపై ఎస్టీలు ఇచ్చిన అట్రాసిటీ కేసు దర్యాప్తుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. పలువురు గ్రామస్థులను పిలిపించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
Similar News
News December 8, 2025
ఎచ్చెర్ల: పీజీలో సీట్లకు ప్రవేశాలు

డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, ఎచ్చెర్లలో వివిధ పీజీ కోర్సుల్లో (ఎం.ఎ, ఎం.కాం, ఎం.ఎస్సీ, ఎం.ఇడి) మిగిలిన సీట్లకు తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ బి. అడ్డయ్య సోమవారం తెలిపారు. ఈ ప్రవేశాలు ఈ నెల 9న మంగళవారం నుంచి క్యాంపస్లో జరుగుతాయన్నారు. ఏపీపీజీసెట్ రాసినా, రాయకపోయినా సీటు పొందని వారు ఈ స్పాట్ అడ్మిషన్స్కు హాజరుకావచ్చని పేర్కొన్నారు.
News December 8, 2025
బాల్యవివాహాలు నిర్మూలన మనందరి బాధ్యత: కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలన మనందరి బాధ్యతని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహాల రహిత భారత దేశంగా ముందుకు నడిపించేందుకు అందరి వంతు కృషి అవసరం అన్నారు. బాల్యవివాహాల వలన ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి అని ఆయన తెలియజేశారు. జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.
News December 8, 2025
శ్రీకాకుళం: ‘ధాన్యాన్ని అధనంగా తీసుకుంటున్నారు’

ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల వద్ద 3 నుంచి 5 కేజీలు అధనంగా రైతుల నుంచి మిల్లర్లు తీసుకుంటున్నారని ఏపీ రైతు సంఘం పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేసింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ప్రసాదరావు, చందర్రావు అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు.


