News January 21, 2025
ఎస్పీని కలిసిన అవనిగడ్డ నూతన డీఎస్పీ విద్యశ్రీ

అవనిగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తాళ్లూరి విద్యశ్రీ సోమవారం కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర రావును మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి డీఎస్పీ పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అవనిగడ్డ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు.
Similar News
News February 15, 2025
గన్నవరం: కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో శుక్రవారం పటమట పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు వంశీబాబు, గంటా వీర్రాజును అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ అరెస్టుతో సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో మొత్తంగా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, రామకృష్ణ జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
News February 14, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. ‘నానీ’లు సైలెంట్

వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్‌తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు.
News February 14, 2025
కృష్ణా: నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది వీరేనా.?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో అదే పార్టీకి చెందిన కొందరు వైసీపీ నాయకులపై కూడా కేసులో ఉన్నాయి. వీరిని కూడా ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఆయనే సూత్రధారుడని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పేర్ని నాని బియ్యం మాయం కేసులో బెయిల్‌పై ఉన్నారు.