News April 15, 2025
ఎస్పీని కలిసిన నూతన డీఎస్పీ

సాధారణ బదిలీల్లో భాగంగా ఒంగోలు మహిళ పోలీస్ స్టేషన్కు నూతన డీఎస్పీగా వి.వి. రమణ కుమార్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్పీ ఆయనకు పలు సూచనలు చేశారు. శక్తి యాప్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News October 18, 2025
ప్రకాశం జిల్లాలో పోలీసుల దాడులు

జిల్లాలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న వారిపై శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కనిగిరి–1, మద్దిపాడు–1, పామూరు–2, వెలిగండ్ల–1, మార్కాపురం టౌన్–1 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి రూ.1,38,944 విలువ గల బాణాసంచాలు సీజ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 18, 2025
ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా గాంధీ

చీమకుర్తికి చెందిన తెల్లమేకల గాంధీని ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా పార్టీ అధిష్టానం నియమించింది. తనను నమ్మి పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని గాంధీ తెలిపారు. పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తానన్నారు. ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
News October 18, 2025
బాణసంచా విక్రయదారులకు SP సూచన.!

అనుమతి లేకుండా బాణసంచాలను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత తనిఖీలను చేశారు. ఈ సందర్భంగా బాణసంచా విక్రయ కేంద్రాల్లో 18ఏళ్లలోపు పిల్లలను పనిలో ఉంచరాదన్నారు.