News November 30, 2024
ఎస్పీ కార్యాలయంలో ఘనంగా ఏఎస్ఐ పదవీ విరమణ సభ
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ ఏఎస్ఐ షామీర్ బాషా పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్పీ రత్న పాల్గొని షామీర్ బాషా దంపతులను శాలువా పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. షామీర్ విధి నిర్వహణలో అందించిన సేవలు మరువలేనివని ఎస్పీ తెలిపారు. కుటుంబంతో సంతోషంగా జీవించాలని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2024
పరిటాల సునీత సెల్ఫీ ఛాలెంజ్
అభివృద్ధి అంటే ఎంటో తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలోని కురుబ వీధి, పరిటాల రవీంద్ర కాలనీల్లో రూ.56 లక్షల నిధులతో నూతనంగా సిమెంట్ రోడ్లు నిర్మించారు. పనులు పూర్తయి రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఆమె సెల్ఫీ తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలోని అభివృద్ధిని ఇలా వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
News December 6, 2024
‘పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా సమిష్టి విధులు నిర్వర్తిద్దాం’
అనంతపురం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ పీ.జగదీశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు. 1940 దశకంలో వలంటీర్ వ్యవస్థగా ఏర్పాటైన హోంగార్డు వ్యవస్థ ప్రస్తుతం పోలీసుశాఖలో కీలకంగా ఉందన్నారు.
News December 6, 2024
పుట్టపర్తి: బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. పరారీలో నిందితుడు
పుట్టపర్తి రూరల్ మండలం బత్తలపల్లిలో ఓ బాలిక పట్ల అసభ్యకంగా ప్రవర్తించిన వ్యక్తిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన సూరి అనే వ్యక్తి గురువారం ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.