News January 31, 2025
ఎస్వీయూలో మరోసారి చిరుత కలకలం

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో చిరుత కలకలం సృష్టిస్తున్నాయి. క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడి ఎత్తుకెళ్లిన చిరుతను విద్యార్థులు గమనించారు. గత నెలరోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చిరుతను గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. యూనివర్శిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్, హాస్టల్ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు.
Similar News
News November 26, 2025
GNT: రాజ్యాంగ సభలో తెలుగు వారి ముద్ర

భారత రాజ్యాంగ నిర్మాణంలో తెలుగు వారికి ప్రత్యేక స్థానం ఉంది. రాజ్యాంగ పరిషత్లోని 299 మంది సభ్యుల్లో పలువురు తెలుగు ప్రముఖులు కీలక పాత్ర పోషించారు. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్, NG రంగా, భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి వారు తమ మేధస్సును అందించారు. పౌరసత్వం, ప్రాథమిక హక్కుల రూపకల్పనలో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, భాషా విభాగంలో మోటూరి సత్యనారాయణ విశేష కృషి చేశారు.
News November 26, 2025
నిజామాబాద్: ‘లోకల్ దంగల్’.. తగ్గేదే లే!

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో NZB జిల్లాలోని 545 గ్రామాల్లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో తగ్గేదేలే అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, BRS మధ్య పోటాపోటీ ఉండబోతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో BJP, CPM, CPIతో పాటు ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ల ప్రభావం కూడా ఉండబోతోందని అంటున్నారు.
News November 26, 2025
సిరిసిల్ల: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి సిరిసిల్ల జిల్లా బోనాల బైపాస్ రోడ్డులో జరిగింది. పెద్దూర్ డబుల్ బెడ్ రూం ఇంట్లో నివాసం ఉండే అలిశెట్టి మహేశ్(40) బోనాల నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఆ ఘటనలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.


