News January 31, 2025
ఎస్వీయూలో మరోసారి చిరుత కలకలం

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో చిరుత కలకలం సృష్టిస్తున్నాయి. క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడి ఎత్తుకెళ్లిన చిరుతను విద్యార్థులు గమనించారు. గత నెలరోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చిరుతను గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. యూనివర్శిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్, హాస్టల్ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు.
Similar News
News July 8, 2025
కోడూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కోడూరు మండలం చిట్వేలి ప్రధాన రహదారి గంధంవడ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి వివరాల మేరకు.. కోనేటి పెంచలయ్య (45) కోడూరులో కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. సోమవారం రాత్రి మోటార్ బైక్‌పై చిట్వేలి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
News July 8, 2025
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..51% పనులు పూర్తి.!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 51 శాతం పనులు పూర్తయినట్లు SCR GM సందీప్ మాథూర్ తెలియజేశారు. ఎక్కడికక్కడ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ పరీక్షలు చేత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
News July 8, 2025
వామ్మో రష్మిక.. గుర్తు పట్టారా!(PHOTO)

‘మైసా’లో లుక్‌తో ప్రేక్షకులను భయపెట్టిన హీరోయిన్ రష్మిక మరో లుక్ వైరలవుతోంది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటో షూట్‌లో వెస్టర్న్ లుక్‌లో ఆమె గుర్తు పట్టకుండా మారిపోయారు. దీనిపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో కొత్త లుక్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తుండగా మరికొందరు దారుణంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. మరి నేషనల్ క్రష్ లేటెస్ట్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.