News August 4, 2024

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం

image

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు సుమధుర గ్రూప్‌ సీఎండీ మధుసూధన్‌ కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఈ  మేరకు డీడీని తిరుమలలోని గోకులం రెస్ట్‌ హౌస్‌లో టీటీడీ అడిషనల్‌ ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు భరత్ కుమార్,నవీన్‌కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 19, 2025

కుప్పం : దీపావళికి స్పెషల్ ట్రైన్స్

image

దీపావళి పండుగ సందర్భంగా 6 రోజులు పాటు కుప్పం మీదుగా రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. రాత్రి 7.55 బెంగళూరు సిటీ నుంచి 9.55 గంకు కుప్పం చేరుకుని జోలార్ పేట్ వెళ్తుంది. తిరిగి అర్ధరాత్రి 11:50 గంలకు కుప్పం నుంచి బెంగళూరు వెళ్లనుంది. ఉదయం 9.40 కి బెంగళూరు సిటీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలు కుప్పం చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12.15కుప్పం నుంచి బయలుదేరి 3 గంటలు బెంగళూరు సిటీ చేరుకుంటుంది.

News October 18, 2025

శాంతిపురం : రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

image

శాంతిపురం (M) బడుగుమాకులపల్లి వద్ద బైకును కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కెనమాకులపల్లికి చెందిన వెంకటరామప్ప (55), సత్యప్ప (60) బైకుపై బడుగు మాకులపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా పలమనేరు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట రామప్ప అక్కడికక్కడే మృతిచెందగా, సత్యప్ప తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించారు.

News October 18, 2025

చిత్తూరు: ఈ నెల 21న హాలిడే కోసం వినతి

image

ఈ నెల 20న దీపావళి పండుగ సందర్భంగా మరుసటి (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటించాలని APTF నాయకులు విద్యాశాఖాధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ కార్యాలయంలో AD సుకుమార్‌ను కలిసిన APTF నాయకులు ఆరోజు పలువురు కేదారేశ్వర స్వామి వ్రతం నిర్వహించుకుంటారని, కావున సెలవు ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుుంటారో వేచి చూడాలి.