News February 21, 2025
ఎస్వీ మెడికల్ కళాశాలలో 9 మంది వైద్యులు తొలగింపు

ఎలాంటి అనుమతులు, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు విధులకు హాజరుకాని వారికి నోటీసులు ఇచ్చిన స్పందించని తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో 9 మంది వైద్యులను లోకాయుక్త ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఎం.వెంకటరావు, వీ.సరస్వతి, బీ.కిరణ్ కుమార్, కే.మధురిమ నాయుడు, పీ.నలిని, బి.చంద్రశేఖర్, కే.లావణ్య, ఏ.కార్తీక్, ఈ. శ్రీకాంత్‌ను తొలగించారు.
Similar News
News October 15, 2025
చిన్నారులు బలి అవుతున్నా సీఎంకు పట్టదా?: YCP

బొబ్బిలి మండలం కృపావలసకు చెందిన గిరిజన విద్యార్థిని తాడంగి <<18010008>>పల్లవి<<>> (11) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. బాలిక మెదడు వాపు వ్యాధితో మృతిచెందినట్లు వైసీపీ ట్వీట్ చేసింది. చిన్నారులు ఇలా వరుసగా బలి అవుతున్నా సీఎం చంద్రబాబుకు పట్టదా అని ప్రశ్నించింది.
News October 15, 2025
GDK: స్పెషల్ యాత్రలకు బయలుదేరిన సూపర్ లగ్జరీ

GDK డిపో నుంచి వివిధ పుణ్యక్షేత్రాలు, విహారయాత్రల కోసం సూపర్ లగ్జరీ బస్సు బుధవారం ఉదయం బయలుదేరింది. రామప్ప, లక్నవరం, బొగత జలపాతాలు, మేడారం దర్శనాలకు యాత్రికులను తీసుకెళ్లనున్నారు. యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రౌండ్ ట్రిప్ ప్యాకేజీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ముందు కూడా దూర ప్రాంతాలకు యాత్ర ప్యాకేజీలు ఉంటాయని, పూర్తి వివరాల కోసం 7013504982 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.
News October 15, 2025
బాపట్ల జాయింట్ కలెక్టర్‌గా భావన బాధ్యతల స్వీకరణ

జిల్లాకు కొత్తగా 8వ జాయింట్ కలెక్టర్‌గా భావన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు DRO గంగాధర్ గౌడ్, AO మల్లిఖార్జునరావు, బాపట్ల, చీరాల, రేపల్లె RDOలు పూల బొకేలు అందజేసి ఆమెకు స్వాగతం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో తహశీల్దార్ సలీమా షేక్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.