News July 21, 2024
ఎస్సారెస్పీకి పెరుగుతున్న వరద
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 15,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 489 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెపాసిటీ 80.5 టీఎంసీలకు ప్రాజెక్టులో 18.443 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతి కెనాల్‌కు 10 క్యూసెక్కుల, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Similar News
News December 12, 2024
దత్తాత్రేయ దేవాలయంలో మంత్రి శ్రీధర్ బాబు పూజలు
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీ సమేతంగా, దత్తాత్రేయ దేవాలయంలో దత్త నవరాత్రుల సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలు, పండ్ల రసాలతో అర్చకులు వేదమంత్రాల మధ్య అభిషేకాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు దేవాలయానికి విచ్చేసి దత్తుని సేవలో తరించారు.
News December 12, 2024
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఏ విధంగా సర్వే చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయన వెంట ఆర్డీవో జివాకర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారి రాజేశ్వర్, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News December 12, 2024
మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?: KTR
రేవంత్ మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా? రూ.50 వేల కోట్లు, రూ.65 వేల కోట్లు వడ్డీలు కడుతున్నామని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియా స్టేటస్ Xలో షేర్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ ఏడాది తెలంగాణ కట్టాల్సిన వడ్డీ రూ.22,406 కోట్లు అని ఆర్బీఐ పేర్కొందని అన్నారు. కాకి లెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా అని విమర్శించారు.