News September 26, 2024
ఎస్సారెస్పీ అప్డేట్.. 2 గేట్ల ద్వారా నీటి విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నేడు ఉదయం 7 గేట్లు ఎత్తిన అధికారులు సాయంత్రం వరకు 5 గేట్లు మూసి 2 గేట్ల ద్వారా 33,318 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల(80.5TMC)కు గాను, ప్రస్తుతం 1091 అడుగుల (80.501TMC)ల నీరు నిల్వ ఉందన్నారు.
Similar News
News October 9, 2024
కరీంనగర్: తమ్ముడిని హత్య చేసిన అన్న
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుందేళ్ల కుమారస్వామి, కుందేళ్ల చంద్రు ఇద్దరు అన్నదమ్ములు. తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో నిన్న రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అన్న కుమారస్వామి తమ్ముడైన చంద్రుని ఇనుపరాడ్‌తో తలపై కొట్టాడు. అనంతరం కుమారస్వామి స్టేషన్‌లో లొంగిపోయాడు.
News October 9, 2024
తంగళ్లపల్లి: మూడు ప్రభుత్వ కొలువులు సాధించిన యువకుడు
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకి చెందిన దాసరి ప్రశాంత్ 2020లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా జాబ్ సాధించాడు. విధులు నిర్వహిస్తూనే రైల్వే గ్రూప్ డీ, ఎస్జీటీ టీచర్, TGPSC గ్రూప్4 మూడు ఉద్యోగాలు ఒకేసారి సాధించాడు. సొంత నోట్స్, రోజు ప్రిపరేషన్ వల్ల తను సక్సెస్ కాగలిగానని ప్రశాంత్ తెలిపాడు. ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన ప్రశాంత్‌ను పలువురు గ్రామస్థులు అభినందించారు.
News October 9, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,44,849 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,00,714, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.27,915, అన్నదానం రూ.16,220,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.