News July 22, 2024

ఎస్సారెస్పీ ప్రాజెక్టులో వరదనీరు

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం మధ్యాహ్నానికి 19.185 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 18,518 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోంది. మిషన్ భగీరథకు 63 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాలకు 108 క్యూసెక్కుల నీటిని చేశారు.

Similar News

News November 28, 2025

KNR: శుక్రవారం సభను సందర్శించిన అడిషనల్ కలెక్టర్

image

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ మండలం కొత్తపల్లి సెక్టార్, రాజీవ్ గృహకల్ప, అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హాజరై మాట్లాడారు. మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని అన్నారు. ప్రతి మహిళలు గర్భిణీ, బాలింత శుక్రవారం సభకు తప్పక హాజరు కావాలని సూచించారు.

News November 28, 2025

కరీంనగర్: NMMSS ‘కీ’ విడుదల

image

8వ తరగతి విద్యార్థులకు ఈనెల 23న నిర్వహించిన NMMSS స్కాలర్ షిప్ అర్హత పరీక్ష KEY విడుదలైందని కరీంనగర్ DEO మొండయ్య తెలిపారు. కీ పేపర్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6 వరకు http/bse.telangana.gov.in సైట్‌లో లేదా dirgovexams.tg@gmail.comకి పంపాలని అన్నారు. లేదా డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు, హైదరాబాద్ నందు సమర్పించాలని తెలిపారు. డిసెంబర్ 6 తరువాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబడవని అన్నారు.

News November 28, 2025

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీ

image

సర్పంచ్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఇందులో భాగంగా గతంలో నేర చరిత్ర ఉన్న ఎన్నికల నేరస్థులను బైండోవర్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపడతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.