News March 20, 2025
ఎస్సారెస్పీ స్టేజ్-2కు రూ.34.01 కోట్లు కేటాయింపు

సూర్యాపేట జిల్లాలోని SRSP స్టేజ్-2 కింద కొనసాగుతున్న పనులకు రూ.34.01 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. తూములు, షట్టర్లు, లైనింగ్ కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. జిల్లాలో వందకు పైగా కిలోమీటర్ల మేరకు ఉన్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు లైనింగ్ లేకపోవడంతో నీటిని విడుదల సమయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మూసీ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు రూ.50కోట్లు కేటాయించడంతో చివరి ఆయకట్టుకు సైతం నీరందనుంది.
Similar News
News February 27, 2026
రేపు అలిపిరికి రానున్న ఆర్కియాలజీ బృందం

శిథిలావస్థలో ఉన్న అలిపిరి సమీపంలోని పురాతన మండపాన్ని ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల తొలగించారు. టీటీడీ దాతల సహకారంతో నిర్మించనున్న ఈ మండపం పనుల తనిఖీ కోసం సెంట్రల్ ఆర్కియాలజీ అధికారులు శనివారం రానున్నారు. పునర్నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. తొలగింపులో తీసిన రాళ్లను ఏలా భద్రపరిచారనే విషయాలతో పాటు పలు సూచనలు చేసే అవకాశం ఉంది.
News February 27, 2026
గ్రేటర్ వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు: కలెక్టర్

ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బస్సుల నిర్వహణకు అవసరమైన డిపో స్థలాన్ని త్వరగా అప్పగించాలని ఆదేశించారు. పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
News February 27, 2026
ఉత్తరాంధ్రకు భారీ ఫార్మా సంస్థ: లోకేశ్

AP: కూటమి పాలనలో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. రేపు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్కులో ప్రముఖ ఫార్మా సంస్థ ‘బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్’కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. రూ.2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. 2028-29 FYకు సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుందని వివరించారు.


