News February 5, 2025

ఎస్సీ, ఎస్టీ కాలనీలలోని దళితుల సమస్యలను గుర్తించండి: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ కాలనీలలో దళితుల సమస్యలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. నూతనంగా ఎంపికైన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సందర్శించి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు, బాధితులకు సత్వర న్యాయం, పరిహార చెల్లింపు, తదితర సమస్యలను గుర్తించాలని అన్నారు.

Similar News

News December 5, 2025

వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

image

☛ ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి.
☛ బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.

News December 5, 2025

VZM: కోర్టు కాంప్లెక్సుల్లో వాష్‌రూమ్‌ల నిర్వహణకు టెండర్లు

image

జిల్లాలోని వివిధ కోర్టు కాంప్లెక్సుల్లో 178 వాష్‌ రూమ్‌ల వార్షిక శుభ్రత నిర్వహణకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత శుక్రవారం తెలిపారు. 18 మంది క్లీనింగ్ సిబ్బందితో ఈ కాంట్రాక్ట్ ఏడాది కాలం అమలులో ఉంటుందని, ఆసక్తి గల అర్హులైన వారు తమ కొటేషన్లను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, విజయనగరానికి సమర్పించాలని కోరారు.

News December 5, 2025

స్మృతి మంధాన ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎక్కడ?

image

తన వివాహం వాయిదా పడిన తర్వాత క్రికెటర్ స్మృతి మంధాన చేసిన తొలి ఇన్‌స్టా పోస్ట్ చర్చనీయాంశమైంది. ఓ యాడ్ షూట్‌ వీడియోను ఆమె షేర్ చేయగా.. అందులో స్మృతి చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపించకపోవడాన్ని ఫ్యాన్స్ గుర్తించారు. దీంతో ఉంగరం ఎక్కడుందని, పెళ్లి రద్దయిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ కొత్త వివాహ తేదీపై ప్రకటన చేయకపోవడం, రింగ్ తీసేయడం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు.