News February 5, 2025

ఎస్సీ, ఎస్టీ కాలనీలలోని దళితుల సమస్యలను గుర్తించండి: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ కాలనీలలో దళితుల సమస్యలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. నూతనంగా ఎంపికైన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సందర్శించి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు, బాధితులకు సత్వర న్యాయం, పరిహార చెల్లింపు, తదితర సమస్యలను గుర్తించాలని అన్నారు.

Similar News

News February 8, 2026

కరీంనగర్: జోరుగా మద్యం పంపిణీ.. విందు రాజకీయాలు షురూ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో విందు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వార్డులలో వాడవాడనా కార్యకర్తల నుంచి మొదలు లీడర్ల వరకు గ్రూపులు విభజించి విందు ఇస్తున్నారు. దీనికి తోడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి మద్యం బాటిల్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల హడావిడి ప్రారంభమైనప్పటి నుంచి ఈ తంతు నడుస్తున్నప్పటికీ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత జోరు అందుకుంది.

News February 8, 2026

భారత్-అమెరికా డీల్: మన చమురుపై వారి పెత్తనమా?

image

రష్యా నుంచి చమురు కొనడం ఆపేయని పక్షంలో మళ్లీ 25% టారిఫ్‌లు విధిస్తామన్న US నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత చమురు కొనుగోలు నిర్ణయాలను అమెరికా శాసించడం ఏంటని కొందరు నిలదీస్తున్నారు. స్వతంత్ర విదేశాంగ విధానం ఉన్న దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. డీల్ సందర్భంగా ట్రంప్ ఏకపక్ష ప్రకటనలు, ఆయన వాడుతున్న అహంకారపూరిత భాషపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

News February 8, 2026

ఇంటర్ ప్రాక్టికల్స్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

image

ఏలూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ మంగళవారంతో ముగుస్తాయని RIO యోహాన్ ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 56 కేంద్రాల్లో థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఉదయం 8:30 గంటలకే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. శనివారం జరిగిన ప్రాక్టికల్స్‌కు 4,363 మంది హాజరవ్వగా, 169 మంది గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.