News March 6, 2025
‘ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి’

బాపట్ల జిల్లా ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక జరిగినట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొత్తపల్లి రమేష్ తెలిపారు. ఈ మేరకు నూతనంగా ఎంపికైన జిల్లా కార్యవర్గ సభ్యులతో కలెక్టర్ వెంకట మురళిని గురువారం బాపట్లలో మర్యాదపూర్వకంగా కలిశారు. రమేశ్ మాట్లాడుతూ.. మీడియా రంగంలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
Similar News
News October 21, 2025
సోమశిలకు ఎలాంటి ప్రమాదం లేదు: సీఈ

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు. జలాశయం నిండిన తర్వాత ఒకేసారి నీటిని విడుదల చేయకుండా.. ముందస్తు ప్రణాళికలో భాగంగా కొంతమేర నీటిని విడుదల చేస్తామని సీఈ వరప్రసాద్ వెల్లడించారు. అవసరాన్ని బట్టి నీటి విడుదల ఉంటుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 71 టీఎంసీల నీరు ఉండగా.. ప్రాజెక్టుకు ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
News October 21, 2025
ఆపరేషన్ సిందూర్కు రాముడే స్ఫూర్తి: మోదీ

దీపావళి వేళ దేశ ప్రజలకు PM మోదీ లేఖ రాశారు. ‘అయోధ్యలో రామమందిరం నిర్మించాక ఇది రెండో దీపావళి. ఈసారి చాలా ప్రత్యేకం. శ్రీరాముడు మనకు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, నీతి నేర్పాడు. కొన్ని నెలల క్రితం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇందుకు నిదర్శనం. నక్సలిజాన్ని నిర్మూలించిన ప్రాంతాల్లోనూ దీపాలు వెలిగాయి. ఇటీవల ఎంతోమంది హింసను వదిలి రాజ్యాంగంపై విశ్వాసంతో అభివృద్ధిలో భాగమవుతున్నారు’ అని పేర్కొన్నారు.
News October 21, 2025
ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

NLG: నార్కట్పల్లి మండలం అమ్మనబోల్ చౌరస్తా వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన మరొకరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.