News January 1, 2025
ఎస్సీ కులగణనపై అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగింపు
ఎస్సీ కుల గణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అనంతపురం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియడంతో మరో వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
Similar News
News January 16, 2025
అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా: ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగు అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతోందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఎస్పీ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, జూదం ఆడుతున్న వారిపై డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
News January 15, 2025
కాకి అనే ఊరు ఉందని మీకు తెలుసా?
కొన్ని ఊర్ల పేర్లు వింటే ఇవి నిజంగానే ఉన్నాయా? అనే సందేహం వస్తుంది. శ్రీసత్యసాయి జిల్లా రొల్ల మండలంలోని ‘కాకి’ అనే గ్రామం కూడా ఇదే కోవలోకి వస్తుంది. దీని పూర్తిపేరు కాంచన కిరీటి. ఏపీలో చివరి గ్రామంగా, కర్ణాటకకు సరిహద్దుగా ఉంటుంది. 2011 జనాభా ప్రకారం ఈ గ్రామంలో 838 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 3వేలకు పైగా జనాభా ఉన్నారు. ఇలా మీకు తెలిసిన గ్రామం పేర్లు ఉంటే కామెంట్ చేయండి.
News January 15, 2025
ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ని కలిసిన కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శాంతిభవనంలో ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కలిశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, ఆర్డిఓ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అలాగే జిల్లాలో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.