News February 5, 2025
ఎస్సీ వర్గీకరణతో ఎవరికీ ఇబ్బంది ఉండదు: మంత్రి రాజనర్సింహా

ఎస్సీ వర్గీకరణతో ఎవరి ప్రయోజనాలకూ ఇబ్బంది కలగదని మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 40ఏళ్ల కల నేడు సాకారం అవుతోందని అన్నారు. 30ఏళ్ల సమస్యకు నేడు పరిష్కారం దొరికిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో కొందరిలో భయం, అభద్రతాభావం ఉందన్న ఆయన వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని తెలిపారు.
Similar News
News November 21, 2025
బెంగళూరులో రూ.7కోట్ల దోపిడీ.. చిత్తూరులో కారు

బెంగళూరు జేపీ నగర్లో బుధవారం పట్టపగలే దోపిడీ చేసిన కొందరు ఏపీ వైపు వచ్చారు. అక్కడి HDFC బ్యాంకు ఏటీఎంలో నగదు జమ చేసే వాహనాన్ని కొంతమంది అడ్డుకున్నారు. రూ.7 కోట్ల నగదును నిందితులకు చెందిన ఇన్నోవా కారులోకి మార్చుకుని పారిపోయారు. చిత్తూరు(D) గుడిపాల మండలం చీలాపల్లి కూడలి పెట్రోల్ బంకు వద్ద కారు వదిలి పరారయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 21, 2025
ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
News November 21, 2025
HYD: అటవీ సంపదను కొల్లగొట్టేందుకే మారణకాండ: CPI

అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు అడ్డంకిగా ఉన్న మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో కేంద్రం హత్య చేస్తుందని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. CPI ఆధ్వర్యంలో మఖ్ధూం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. TPCC అధ్యక్షుడు మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. జనజీవన స్రవంతిలో కలుస్తామని ముందుకు వచ్చే మావోయిస్టులను పట్టుకొని చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.


