News February 5, 2025
ఎస్సీ వర్గీకరణతో ఎవరికీ ఇబ్బంది ఉండదు: మంత్రి రాజనర్సింహా

ఎస్సీ వర్గీకరణతో ఎవరి ప్రయోజనాలకూ ఇబ్బంది కలగదని మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 40ఏళ్ల కల నేడు సాకారం అవుతోందని అన్నారు. 30ఏళ్ల సమస్యకు నేడు పరిష్కారం దొరికిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో కొందరిలో భయం, అభద్రతాభావం ఉందన్న ఆయన వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని తెలిపారు.
Similar News
News February 13, 2025
MDK: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
News February 13, 2025
ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్న

AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీలేదని తేల్చి చెప్పారు. బర్డ్‌ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని, కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కి.మీ పరిధికే ఇది పరిమితం అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు.
News February 13, 2025
హుస్సేన్‌సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.