News March 19, 2025
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర్ కామెంట్స్

ఎస్సీ వర్గీకరణ హేతు వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం ఇదో చారిత్రాత్మకమైన రోజు అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వివక్షను రూపుమాపేందుకు తెచ్చిన రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణ బిల్లును తెచ్చామని మంత్రి వెల్లడించారు.
Similar News
News April 24, 2025
మెదక్: రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గఫూర్ అనే వ్యక్తి దౌల్తాబాద్‌లో కూలీ పని కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పులిమామిడి వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని స్థానికులు తెలిపారు.
News April 24, 2025
సిద్దిపేట: అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య

అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. వివరాలు.. దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లికి చెందిన చిన్న నర్సింహా రెడ్డి(56) సిద్దిపేటలోని గ్రీన్ కాలనీలో టింబర్ డిపో నడిపిస్తున్నాడు. వ్యాపారం కోసం చేసిన అప్పులు తీరకపొవడంతో మనస్తాపానికి గురైన నర్సింహారెడ్డి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News April 24, 2025
ఖేడ్: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

నారాయణఖేడ్ మండలం జి.హుక్రానాలో బుధవారం విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హనుమారెడ్డి భార్య రావుల స్వప్న (40) బట్టలు ఉతికి ఆరేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురైంది. దీంతో తీవ్ర గాయాల పాలైన స్వప్నను నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.