News February 1, 2025
ఎస్సై ఆత్మహత్యతో నివ్వెరపోయిన స్వగ్రామం

అందరితో మంచిగా ఉండేవారు. ఆప్యాయంగా పలకరించేవారు. ఏ కష్టమొచ్చిందో..ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో? అంటూ ఎస్ఐ సత్యనారాయణమూర్తి స్వగ్రామం కె.గంగవరం వాసులు నివ్వెరపోయారు. ప.గో.జిల్లా తణుకు ఎస్ఐగా పనిచేస్తున్న సత్యనారాయణమూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. దీంతో అతని కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. అతనికి భార్య విజయ, ఐదేళ్ల కొడుకు, 16 నెలల కూతురు ఉన్నారు.
Similar News
News December 10, 2025
VKB: మొదటి విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

వికారాబాద్ జిల్లాలో ఈనెల 11న జరగనున్న మొదటి విడత ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌పై ఆయన సమీక్షించారు. మొదటి విడతలో భాగంగా ఉదయం పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 10, 2025
WGL: రూ.60-100 కోట్ల వరకు మద్యం ఖర్చు..!

పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో మద్యం పర్వం జోరందుకుంది. కుల, యువజన సంఘాల మద్దతు కోసం అభ్యర్థులు బ్రాండెడ్ మద్యంతో పాటు నాన్‌వెజ్ భోజనాలతో దావత్‌లు ఇస్తున్నారు. చిన్న గ్రామాల్లో రూ.లక్ష, పెద్ద గ్రామాల్లో రూ.5 లక్షల వరకు మద్యం ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. పోటీ ఎక్కువైతే ఈ వ్యయం రూ.20 లక్షలకు చేరుతోంది. ఉమ్మడి WGL జిల్లాలో మొత్తం రూ.60-100 కోట్ల వరకు మద్యం ఖర్చు అయ్యే వీలున్నట్లు అంచనా.
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<


