News December 5, 2024

ఎస్సై ఆత్మహత్య.. ఇన్‌స్టా అమ్మాయే కారణం!

image

ములుగు(D) వాజేడు SI హరీశ్‌కు సూర్యాపేటకు చెందిన యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆమె గురించి వాకబు చేయగా గతంలో ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని తెలిసింది. పెళ్లి ఇష్టంలేదని, సెటిల్మెంట్ కోసం ఆమెను హరీశ్ రిసార్ట్‌కు పిలిచారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో విషయం ఉన్నతాధికారులకు చెబుతానని యువతి బెదిరించింది. దీంతో హరీశ్ సూసైడ్ చేసుకున్నారు.

Similar News

News January 14, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News January 14, 2025

ఖమ్మం: మంత్రి తుమ్మల పట్టుబట్టి మరి సాధించారు: ఉత్తమ్

image

మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మంత్రి తుమ్మల పట్టు బట్టి మరి సాధించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సంక్రాంతి కానుకగా రఘునాథపాలెం ప్రజలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఇవ్వాలని తుమ్మల పట్టుబట్టారన్నారు. రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రంగా ఆయకట్టు నిర్మించినా సాగులోకి మాత్రం తీసుకు రాలేదన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించి ఒక్క ఎకరాకు సైతం సాగు నీరు అందించలేదన్నారు.

News January 14, 2025

KMM: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.