News March 19, 2025
ఎస్.అన్నవరం: రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత కుసనం దొరబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున తుని రైల్వే స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై ఆయన స్వగ్రామం ఎస్.అన్నవరం వెళుతుండగా కుక్కలు అడ్డురావడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్య ఎస్.అన్నవరంలో ఓ సెగ్మెంట్కి ప్రస్తుతం ఎంపీటీసీగా ఉన్నారు.
Similar News
News November 16, 2025
ఆడపిల్లల చదువు ఆపేస్తున్నారు: కవిత

TG: మగ పిల్లల చదువు కోసం అప్పులు చేసైనా ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు కానీ ఆడపిల్లలను మాత్రం ఆపేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విద్యావ్యవస్థ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఆడపిల్లల చదువు చాలా డెలికేటెడ్ సమస్యగా మారింది. బస్సు లేకపోయినా, వీధి దీపం లేకపోయినా సరే ఆడపిల్లల చదువు ఆపేస్తున్నారు. బాలికల విద్య, ఉద్యోగానికి సంబంధించి సపరేట్ విధానం అమలు చేయాలి’ అని తెలిపారు.
News November 16, 2025
విజయనగరం జిల్లాలో జాబ్ మేళా

AP:విజయనగరం జిల్లాలోని మహారాజ్ కాలేజీలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ITI, డిగ్రీ, పీజీ, ANM, GNM, BSc, MSc (నర్సింగ్), ఫార్మసీ ఉత్తీర్ణులై, 18- 45ఏళ్ల లోపు వారు అర్హులు. 280 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ కార్డ్ తప్పనిసరి. అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: employment.ap.gov.in
News November 16, 2025
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


