News June 6, 2024
ఎస్.కోటలో తాత రికార్డు బద్దలు కొట్టిన మనుమరాలు
ఉత్తరావల్లి నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పుడు 1983లో కోళ్ల లలిత కుమారి తాత అప్పలనాయుడు టీడీపీ తరఫున 30,329 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు అదే అత్యధిక మెజార్టీ. S.కోట నియోజకవర్గ కేంద్రం ఏర్పాటయ్యాక 2009లో TDP తరఫున పోటీ చేసిన కోళ్ల 3,440 ఓట్ల ఆధిక్యత సాధించగా.. 2104లో 28,572 మెజార్టీతో గెలిచింది. ఈ ఎన్నికల్లో 38,790 ఓట్ల మెజార్టీతో గెలిచి.. తన తాత పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.
Similar News
News November 28, 2024
గజపతినగరం: శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయుడి మృతి
విద్యా వ్యవస్థ బలోపేతానికే శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గజపతినగరం మండలం మరుపల్లి పరిధిలో గల పాలిటెక్నికల్ కళాశాలలో శిక్షణ ఇస్తున్న శ్రీను అనే ఉపాధ్యాయుడు గురువారం గుండెపోటుతో మరణించాడు. ఈ ఉపాధ్యాయుడు శ్రీకాకుళం వాసిగా స్థానిక ఎంఈవో సాయి చక్రధర్ తెలిపారు.
News November 28, 2024
VZM: పవన్ కళ్యాణ్ దృష్టికి ఏనుగుల సమస్య
ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకువెళ్లానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఏనుగుల సంచారంతో పంటలు, ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు జీవన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పవన్‌కు వివరించామన్నారు. ఏనుగుల కదలికలను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీలో కలిసి కోరినట్లు ఎంపీ తెలిపారు.
News November 28, 2024
బలిజిపేట: వ్యక్తి సూసైడ్.. అప్పుల భారమే కారణం
బలిజిపేట మండలం గంగాపురంలో అప్పుల భారంతో వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై సింహాచలం వివరాల ప్రకారం.. ఇటుక బట్టీ నిర్వహిస్తున్న రవి అప్పులు ఎక్కువగా చేశాడు. వీటిని సమయానికి తీర్చలేక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స కోసం విజయనగరం తరలించగా బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.