News May 19, 2024
ఎస్.కోట: పిడుగుపాటుతో వ్యక్తి మృతి
ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన అప్పలస్వామి అనే గొర్రెల కాపరి ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఎప్పటిలాగే తన మేకలను మేపేందుకు గ్రామ సమీపంలో మెట్టకు వెళ్లాడు. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చినప్పటికీ అప్పలస్వామి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెతికారు. ఈ నేపథ్యంలో అప్పలస్వామి గ్రామ సమీపంలో పిడుగు పడి మృతి చెంది ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తీవ్రంగా రోదిస్తూ వెల్లడించారు.
Similar News
News December 11, 2024
విజయవాడకు వెళ్లిన విజయనగరం, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు డా.అంబేడ్కర్, ఏ.శ్యాం ప్రసాద్ విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.
News December 11, 2024
విజయనగరం పట్టణంలో ఆక్రమణలు తొలగింపు
విజయనగరంలోని సాలిపేట రహదారిలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆక్రమణలను మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య ఆదేశాలతో పట్టణ ప్రణాళిక సిబ్బంది మంగళవారం తొలగించారు. ఎన్సీఎస్ థియేటర్ రోడ్‌లో అనధికార ప్రకటన బోర్డులను తొలగించారు. సాలిపేట రోడ్‌లో అనధికారికంగా నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రణాళిక విభాగం అధికారులు నిర్మాణ దశలోనే వాటిని అడ్డుకున్నారు. ఆక్రమణలను ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు.
News December 10, 2024
విజయనగరంలో నటి సూర్యకాంతం కుటుంబ సభ్యులు
అలనాటి ప్రముఖ సినీ నటి సూర్యకాంతం కుటుంబ సభ్యులు విజయనగరంలో మంగళవారం పర్యటించారు. సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభ మూర్తి, కోడలు ఈశ్వరరాణి, తదితరులు గురజాడ అప్పారావు మ్యూజియాన్ని సందర్శించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ అప్పారావు ముని మనవడు గురజాడ ప్రసాద్ పాల్గొన్నారు.