News September 16, 2024
ఎస్.కోట: మద్యం మత్తులో వ్యక్తి సజీవ దహనం

ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామంలో ఓ వృద్ధుడు ఆదివారం సజీవదహనమయ్యాడు. రాత్రి వినాయక నిమజ్జనంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెంట నాగు(74) మద్యం తాగి సిగరెట్ వెలిగించాడు. ఈ క్రమంలో సిగరెట్ నిప్పు అంటుకోవడంతో మంచంతో పాటు ఆయన సజీవ దహనమయ్యాడు. ఇంట్లో ఉన్న భార్య కేకలు వేసినా ఫలితం లేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 2, 2025
బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి

బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేట్ కళాశాలలో చదవ లేక పేదలు విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు.
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.